• Login / Register
  • Telangana News | తెలంగాణ.. ఒకప్పటి త్రిలింగ దేశం

    Telangana News | తెలంగాణ.. ఒకప్పటి త్రిలింగ దేశం
    మన రాష్ట్రం శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి
    వేములవాడ, వేయిస్తంబాల గుడి.. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా శివ భక్తులు కనిపిస్తారు..
    కోటీ దీపోత్స‌వానికి హాజ‌రైన సీఎం రేవంత్‌రెడ్డి

    Hyderabad : తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు త్రిలింగ‌దేశం అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి న‌గ‌రంలో నిర్వ‌హిస్తున్న కోటీ దీపోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. మ‌న తెలంగాణ రాష్ట్రం శైవ క్షేత్రాల‌కు ప్ర‌సిద్ధి అని తెలిపారు. వేముల‌వాడ‌, వేయి స్థంభాల గుడి.. ఇలా రాష్ట్రంలో ఎక్క‌డ చూపినా శివ భ‌క్తులు క‌నిపిస్తారు అని పేర్కొన్నారు. అలాగే  గ‌త  12 ఏళ్ల క్రితం లక్ష దీపాలతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం కోటి దీపోత్సవంతో 13 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింద‌ని తెలిపారు. సమాజమంతా సుఖ శాంతులతో వర్ధిల్లాలని భక్తి టీవీ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోష దాయ‌క‌మ‌ని తెలిపారు. 
    కార్తీకమాసం వచ్చిందంటే.. శివయ్య భక్తులు మన రాష్ట్రం వైపు.. హైదరాబాద్ వైపు చూసేలా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమ‌న్నారు. కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగించినా మనకు మేలు జరుగుతుందంటార‌న్నారు. అలాంటిది.. భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతున్నాను అని చెప్పారు. ఇంతగొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి కార్తీక మాసం గొప్పదనాన్ని చాటి చెబుతున్న భక్తీ టీవీ యాజ‌మాన్యాన్ని అభినందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఒక స్ఫూర్తిని నింపేలా భక్తుల కోసం ప్రతీ ఏటా కార్యక్రమం నిర్వహించడం ఒక గొప్ప యజ్ఞమ‌న్నారు. ఇలాంటి యజ్ఞాలు భక్తి టీవీ యాజమాన్యం మరిన్ని నిర్వహించాలని కోరుకుంటున్నా.. అని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా దగ్గరుండి ప్రతీది అందుబాటులో ఉంచడం కోసం చేసిన వారి కృషికి నిదర్శనమ‌న్నారు. ఈ కార్యక్రమం స్పూర్తితో తెలంగాణ రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో దీపోవత్సవాలు నిర్వహించుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణకు మేలు జరగాలని కోరుకుంటున్నాన‌ని సీఎం రేవంత్‌రెడ్డి అభిల‌షించారు. 
    *  *  *

    Leave A Comment